
దళితుల భుజం మీద తుపాకీ పెట్టి అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చడానికి కేసీఆర్ తెరలేపారన్నారు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందజకృష్ణ మాదిగ. రాజ్యాంగం మీద దళితులు దళిత సంఘాలు మాట్లాడే స్వేచ్ఛ, హక్కు లేదు అని కేసీఆర్ అన్నారన్నారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కేసీఆర్ పైన నమోదు చేస్తున్నామన్నారు. అన్ని సంఘాలు మద్దతు తెలపాలన్నారు. రాష్ట్ర గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. కెసిఆర్ తనకు జైలుకు పంపిస్తారా అని అన్నారు కదా... అన్ని పోలీస్ స్టేషన్లో కేసీఆర్‌పై కేసులు పెడతామని మందకృష్ణ హెచ్చరించారు. మూడు అంశాలపైన కేసీఆర్ కేసు పెట్టి రాబోయే రోజుల్లో జైలుకు పంపించే బాధ్యత తీసుకుంటామన్నారు. ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ నిధులు పక్కదారి పట్టించారు కాబట్టి కేసీఆర్‌ను అరెస్టు చేసి జైల్లో పెట్టే దమ్ము తమకు మాత్రం ఉందన్నారు.
ఇవి కూడా చదవండి:
కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్లు వీళ్లే
సీఎం కేసీఆర్కు అర్వింద్ కౌంటర్