
గంగాధర, వెలుగు: భార్య కాపురానికి రావడం లేదని ఓ భర్త ఉరేసుకుని ఆత్మహ్యత చేసుకున్నాడు. ఎస్సై అభిలాష్ తెలిపిన వివరాల ప్రకారం... గంగాధర మండలం వెంకటాయపల్లికి చెందిన మంద రాములు(35) తన భార్య కాపురానికి రావడం లేదని మంగళవారం అంబేడ్కర్ కమ్యూనిటీ హాల్ వద్ద చెట్టుకు ఉరేసుకుని చనిపోయాడు. రాములు తాగుడుకి బానిసయ్యాడు. నెల రోజుల క్రితం భార్య వజ్రతో గొడవ పడగా ఆమె పుట్టింటికి వెళ్లింది. ఆదివారం తన భార్యను కాపురానికి తీసుకొచ్చేందుకు అత్తాగారి ఊరైన కొడిమ్యాల మండలం దమ్మన్నపేటకు వెళ్లాడు. కాపురానికి రమ్మని తన భార్యను కోరగా తాగుడు మానేస్తేనే కాపురానికి వస్తానని భార్య చెప్పింది. దీంతో మనస్థాపం చెంది ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి అన్న దుర్గయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.