30 వరకు శబరిమల అయ్యప్ప దర్శనాలు బంద్

30 వరకు శబరిమల అయ్యప్ప దర్శనాలు బంద్

పతనంతిట్ట: శబరిమల అయ్యప్ప స్వామి మండల పూజా మహోత్సవం ముగిసింది. పంబా నది మార్గంలో ఉన్న పార్థసారథి ఆలయం నుంచి థన్కాంకి ఊరేగింపు నిర్వహించారు. కొవిడ్ నిబంధనల మధ్య రాత్రి మండల పూజ కార్యక్రమాలు విజయవంతంగా ముగిశాయి. ఆ తర్వాత అర్చకులు సన్నిధానం తలుపులు మూసివేశారు. వచ్చే నెల 14న మకర సంక్రాంతి సందర్భంగా నిర్వహించనున్న మకరవిళక్కు, అదే నెల 18న నిర్వహించనున్న మహా పుడిపూజ కోసం డిసెంబర్ 30 నుంచి అయ్యప్ప ఆలయ తలుపులు తిరిగి తెరుచుకోనున్నాయి. 

మరిన్ని వార్తల కోసం: 

ఒక్క ఆలోచన కోట్లు కురిపిస్తోంది

చలి గుప్పిట్లో ఉత్తర భారతం

కొత్త ఏడాదిలో శాలరీ హైక్‌‌‌‌‌‌‌‌‌‌లు కూడా ఎక్కువే