ఢిల్లీలో మళ్లీ తగ్గిన ఎయిర్ క్వాలిటీ

ఢిల్లీలో మళ్లీ తగ్గిన ఎయిర్ క్వాలిటీ

న్యూఢిల్లీ: ఉత్తర భారతం చలితో వణికిపోతోంది. పొగమంచు భారీగా కురుస్తుండటంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఉత్తర్ ప్రదేశ్, ఢిల్లీ, పంజాబ్ లో ఉదయం 9 గంటలైనా పొగమంచు తేరుకోవడం లేదు. దీంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ఇక, దేశ రాజధానిలో ఉష్ణోగ్రతలు అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయాయి. అక్కడ 4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరోవైపు గాలి నాణ్యత కూడా పడిపోయింది. జనవరిలో చలి మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

మరిన్ని వార్తల కోసం: 

సర్కారు కళ్లు తెరిపించేందుకే కొలువుల కొట్లాట

పవన్ అభిమానులకు శుభవార్త

కొత్త ఏడాదిలో శాలరీ హైక్‌‌‌‌‌‌‌‌‌‌లు కూడా ఎక్కువే