- ఓసీపీ ఎక్స్టెన్షన్తో పట్టణాభివృద్ధి
- మందమర్రి ఏరియా జీఎం రాధాకృష్ణ
కోల్బెల్ట్, వెలుగు: ఆర్కేపీ సింగరేణి ఓపెన్ కాస్ట్రెండో ఫేజ్ఎక్స్టెన్షన్ రామకృష్ణాపూర్ పట్టణాభివృద్ధికి మరింత దోహదపడుతుందని, కాంట్రాక్ట్ఉద్యోగాల్లో స్థానిక నిరుద్యోగులకు ప్రయారిటీ కల్పిస్తామని మందమర్రి ఏరియా సింగరేణి జీఎం ఎన్.రాధాకృష్ణ అన్నారు. బుధవారం రామకృష్ణాపూర్ ఓసీపీ పీవో ఆఫీస్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఓసీపీ ఎక్స్టెన్షన్మైన్ వివరాలు వెల్లడించారు.
రామకృష్ణాపూర్లో మూసివేసిన ఆర్కే1, 1ఏ, 3, 4 గనుల్లో మిగిలిఉన్న బొగ్గును వెలికితీసేందుకు యాజమాన్యం ఆర్కేపీ ఓసీపీ రెండో ఫేజ్ఎక్స్టెన్షన్ మైన్ను ఏర్పాటు చేయనుందన్నారు. ఓసీపీ ఎక్స్టెన్షన్తో 18 ఏండ్ల పాటు మైనింగ్ కార్యకలాపాలు నిర్వహించవచ్చని తెలిపారు. ఏటా 2.50 మిలియన్టన్నుల నుంచి 3.75 మిలియన్టన్నుల వరకు సుమారు 32.67 మిలియన్టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసే ఛాన్స్ ఉందన్నారు. రెండో ఫేజ్లో 1209.249 హెక్టార్ల భూమి అవసరమన్నారు.
ఇండ్లు, ప్రజలకు నష్టం జరగదు
ప్రాజెక్టు కోసం సింగరేణి యాజమాన్యం రూ.442.90 కోట్లను కేటాయించిందని చెప్పారు. పబ్లిక్ హియరింగ్లో అన్ని వర్గాలు పాల్గొని ఓసీపీ ఎక్స్టెన్షన్కు సహకరించాలని కోరారు. కొత్తగా ఓసీపీ ఎక్స్టెన్షన్వల్ల 156 మందికి సింగరేణి శాశ్వత ఉద్యోగులు,794 మందికి కాంట్రాక్ట్, ఆవుట్సోర్సింగ్ఉద్యోగాలు లభిస్తాయన్నారు. అటవీ భూమి, ఈసీ పర్మిషన్ల కోసం యాజమాన్యం దరఖాస్తు చేసిందన్నారు. పట్టణంలోని ఆర్కే4 గడ్డ, శాంతినగర్ ప్రాంతంలోని ఇండ్లకు, ప్రజలకు ఎలాంటి నష్టం ఉండదన్నారు.
సీఎస్ఆర్ఫండ్స్ రూ.109లక్షలతో అమరవాదితో పాటు మరో నాలుగు చెరువుల అభివృద్ధి పనులను చేపట్టనున్నామని జీఎం తెలిపారు. సమావేశంలో ఏస్వోటుజీఎం, ఆర్కేపీ ఓసీపీ ఇన్చార్జ్ లలితేంద్రప్రసాద్, డీజీఎం (పర్సనల్) సీహెచ్.అశోక్, పర్సనల్ మేనేజర్ఎస్.శ్యాంసుందర్, ఎన్విరాన్మెంట్ఆఫీసర్ వెంకటరెడ్డి, సెక్యూరిటీ ఆఫీసర్రవికుమార్, ఆర్కేపీ ఓసీపీ మేనేజర్ పంకజ్సింగ్, డీవైపీఎం సత్యనారాయణపాల్గొన్నారు.
