మంత్రి వివేక్పై ఆరోపణలు చేస్తే సహించం : మందమర్రి మండల కాంగ్రెస్ లీడర్లు

మంత్రి వివేక్పై ఆరోపణలు చేస్తే సహించం : మందమర్రి మండల కాంగ్రెస్ లీడర్లు
  • హెచ్చరించిన మందమర్రి మండల కాంగ్రెస్ ​లీడర్లు

కోల్​బెల్ట్, వెలుగు: రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామిపై అసత్య ఆరోపణలు చేస్తే ఊరుకోబోమని మందమర్రి మండల కాంగ్రెస్ ​లీడర్లు హెచ్చరించారు. శనివారం మందమర్రిలోని ప్రెస్​క్లబ్​లో మీడియా సమావేశంలో బ్లాక్​ కాంగ్రెస్​ ప్రెసిడెంట్ గందె రాంచందర్, మాజీ సర్పంచ్ ఒడ్నాల కొమురయ్య తదితరులు మాట్లాడారు. మంత్రి వివేక్ జిల్లా అభివృద్ధికి కృషి చేస్తుంటే ఓర్వలేక బీఆర్ఎస్​ లీడర్లు ఆరోపణలు, అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. జిల్లాలో బీఆర్​ఎస్​హయంలోనే విచ్చలవిడిగా ఇసుక, ఇతర దందాలు విచ్చలవిడిగా నడిచాయన్నారు. 

వివేక్​వెంకటస్వామి బాధ్యతలు చేపట్టాక వాటిని పూర్తిగా బంద్​ చేయించారని, అందుకే జీర్జించుకోలేని బీఆర్ఎస్ లీడర్లు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. చెన్నూర్​నియోజకవర్గంలో ఎక్కడా యూరియా కొరత లేదని, సరిపడే నిల్వలు ఉన్నాయన్నారు. పదేండ్ల బీఆర్ఎస్ ​పాలనలో ఒక్కరికి కూడా ఇండ్లు, రేషన్​కార్డులు ఇవ్వలేదని.. కాంగ్రెస్​ వచ్చిన తర్వాత అర్హులకు ఇందిరమ్మ ఇండ్ల, కొత్త రేషన్ ​కార్డులు ఇస్తోందన్నారు. మంత్రి వివేక్​పై ఆరోపణలు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. సమావేశంలో మాజీ సర్పంచ్​లు కమల మనోహర్​రావు, అసంపల్లి రాజయ్య, గోదారి రాజేశ్, మాజీ ఎంపీటీసీ కుమారస్వామి, లీడర్లు రాయమల్లు, తాజోద్దిన్, రాములు, దుర్గం సుధాకర్​తదితరులు పాల్గొన్నారు.