కోల్బెల్ట్, వెలుగు: లారీ, బైక్ ఢీకొనడంతో భర్త చనిపోగా, భార్య పరిస్థితి విషమంగా ఉంది. మంచిర్యాల జిల్లా మందమర్రి–-మంచిర్యాల హైవేపై బొక్కలగుట్ట గాంధారీ మైసమ్మ ఆలయం సమీపంలో సోమవారం రాత్రి బైక్ పై వెళ్తున్న సింగరేణి కార్మిక దంపతులు ప్రమాదానికి గురయ్యారు.
పెద్దపల్లిలోని బంధువుల ఇంటికి బైక్పై వెళ్లి తిరిగి మందమర్రికి తిరిగి వస్తుండగా, మైసమ్మ ఆలయం సమీపంలో ఆగి ఉన్న లారీని బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మందమర్రి ఏరియా ఆర్కే-5 బొగ్గు గనిలో ట్రామర్గా పని చేసే పోషిణి వెంకటేశ్(48) అక్కడికక్కడే చనిపోయాడు.
అతని భార్య సుమలతకు తీవ్రగాయాలవగా, ఆమెను మంచిర్యాలలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి సీరియస్గా ఉంది. రామకృష్ణాపూర్ టౌన్ ఎస్సై శ్రీధర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
