విద్య, వైద్యానికి ప్రభుత్వం కృషి : మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీమ్ అక్తర్

విద్య, వైద్యానికి ప్రభుత్వం కృషి : మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీమ్ అక్తర్
  •     మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీమ్ అక్తర్

జన్నారం, వెలుగు: విద్య, వైద్యానికి ప్రభుత్వం కృషి చేస్తోందని మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీమ్ అక్తర్ అన్నారు. సోమవారం ఆయన మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో పర్యటించారు. మండల కేంద్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలను సందర్శంచి విద్యార్థులతో మాట్లాడారు. అక్కడి నుంచి పీహెచ్​సీని సందర్శించి పేషెంట్లతో మాట్లాడారు. 30 పడకల హాస్పిటల్ గా మార్చాలని టీపీసీసీ ఎస్సీ సెల్ జాయింట్ కన్వీనర్ కత్తెరపాక రాజేశ్ కోరారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చైర్మన్ హమీనిచ్చారు.

అనంతం ఇందన్ పెల్లి లోని వెదురు ఉత్పత్తుల శిక్షణ కేంద్రాన్ని సందర్శించారు. గిరిజనులు వెదురుతో తయారు చేసిన వస్తువులను పరిశీలించారు. కోతుల సమస్యను పరిష్కరించాలని జన్నారం అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో చైర్మన్​కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాస్, జన్నారం ఎఫ్ డీవో రామ్మోహన్, డీటీడీవో రమాదేవి, సీఐ రమణమూర్తి, ఇన్​చార్జి తహసీల్దార్ రామ్మోహన్ పాల్గొన్నారు.