కాగజ్‌నగర్, వెలుగు: కాగజ్ నగర్ మండలం సీతానగర్ పంచాయతీ వల్లకొండ సమీపంలో శనివారం గుర్తుతెలియని వ్యక్తులు పడేసిన నవజాత ఆడ శిశువు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో రెండు రోజుల పాటు చికిత్స అందించారు. సోమవారం ఎస్పీ నితికా పంత్ ఆస్పత్రిని సందర్శించి శిశువుకి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అనంతరం శిశువును ఆదిలాబాద్ శిశుగృహానికి తరలించారు.
