కోల్‌బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లా మందమర్రి ప్రెస్‌క్లబ్ నూతన కమిటీ ఎన్నికలను బుధవారం నిర్వహించారు. అధ్యక్ష పదవి కోసం జి.చందర్,తేల్ల విజయ్‌కుమార్,ఎం.డి.అక్బర్ పోటీ పడ్డారు.చందర్ సమీప ప్రత్యర్థి విజయ్‌కుమార్‌పై గెలిచారు. జనరల్ సెక్రటరీగా సలామొద్దీన్, అనిల్, రమేశ్ పోటీ పడగా సలామొద్దీన్.. అనిల్‌పై గెలిచారు. కోశాధికారిగా సకినాల శంకర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు.
ఎన్నికల్లో మొత్తం 38 మంది క్లబ్ సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. నూతన కమిటీ,పాత కమిటీ బాధ్యులను అడ్హాక్ కమిటీ,జర్నలిస్టు సంఘం జిల్లా బాధ్యులు రేణికుంట్ల శ్రీనివాస్ సన్మానించారు.జర్నలిస్టుల సంక్షేమం కోసం కృషి చేస్తానని నూతన అధ్యక్షుడు జి.చందర్ తెలిపారు.
