ఆసిఫాబాద్, వెలుగు : కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి జక్కుల అనంతలక్ష్మి బుధవారం కాలినడకన కోర్టుకు వెళ్లారు. ఇంధన పొదుపులో భాగంగా అధికారిక వాహనాన్ని వదిలి కాలినడకన కోర్టుకు వచ్చినట్లు తెలిపారు. రోజు రోజుకు పెరుగుతున్న కాలుష్యం, ఇంధన కొరతను తగ్గించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. శారీరక శ్రమ తగ్గిపోతున్న ఈ రోజుల్లో కాలినడక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్నారు.
