బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే మందాడి సత్యనారాయణ రెడ్డి కన్నుమూశారు. జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం ఇప్పగూడలో ఆయన జన్మించారు. బీజేపీలో కార్యకర్తగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పార్టీ ఉపాధ్యక్షులుగా పనిచేశారు. బీజేపీ బలోపేతానికి ఎంతగానో కృషి చేశారు. 2004లో ఎమ్మెల్యేగా గెలిచారు. రాజకీయ నేతగానే కాకుండా గాయకుడు, రచయిత, కవిగా గుర్తింపు పొందారు. తెలంగాణ ఉద్యమ సమయంలో మందాడి సత్యనారాయణ కీలక పాత్ర పోషించారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని సామాన్య ప్రజలకు అర్ధం అయ్యేలా పాటలు రాసి అసెంబ్లీ వేదికగా పాడారు.
మందాడి సత్యనారాయణ మృతి పట్ల బండి సంజయ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మందాడి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి సంతాపం తెలిపారు. సత్యనారాయణ మరణం కుటుంబ సభ్యులకు, పార్టీకి తీరని లోటు అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలిగించాలని కోరకుంటున్నట్లు బండి సంజయ్ తెలిపారు. అటు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య కూడా సంతాపం తెలిపారు.
