మండి నుంచి కంగన గెలుపు

మండి నుంచి కంగన గెలుపు

హిమాచల్ ప్రదేశ్‌లోని మండి లోక్​సభ నియోజకవర్గం నుంచి సినీనటి, బీజేపీ అభ్యర్థి కంగన రనౌత్ విజయం సాధించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..  తన విజయం ప్రధాని మోదీ ఘనతేనని పేర్కొన్నారు. కంగనా.. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్‌ పార్టీకి చెందిన విక్రమాదిత్య సింగ్‌పై 74,755 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కంగనాకు 5,37,022 ఓట్లు రాగా.. విక్రమాదిత్య సింగ్‌ కు 4,62,267 ఓట్లు పోలయ్యాయి. కాగా.. కుటుంబ వారసత్వానికి వ్యతిరేకంగా, సామాన్యులకు అనుకూలంగా మండి ప్రజలు ఓటు వేశారన్నారు. మండి ప్రజల కోసం తాను కష్టపడి పనిచేస్తానని అన్నారు. ‘‘ మీ ప్రేమ, నమ్మకానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ విజయం మీ అందరికీ చెందుతుంది.