మాండూస్ ప్రభావం : హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు

మాండూస్ ప్రభావం : హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు

మాండూస్ తుఫాను ఎఫెక్ట్ తో  తెలంగాణలోని పలు జిల్లాలో ఆదివారం రాత్రి మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. హైదరాబాద్ పరిధిలోని ఖైరతాబాద్, మెహిదీపట్నం, అత్తాపూర్, నాంపల్లి, బంజారా హిల్స్, పంజాగుట్ట, మాసబ్ ట్యాంక్, ఎం.జే.మార్కెట్, అఫ్జల్ గంజ్ ప్రాంతాల్లో వర్షం పడింది.  ఫలక్ నుమా, రాజేంద్రనగర్, ఎల్బీనగర్, మలక పేట్, సరూర్ నగర్, చార్మినార్, బహదూర్ పుర, చంద్రంగుట్ట, కార్వాన్, బండ్లగుడ, సైదాబాద్, ఆసిఫ్ నగర్, గోల్కొండ,ఉప్పల్, జూబ్లీహిల్స్, గచ్చిబౌలి, కుత్బుల్లాపూర్ పరిధిలోని గాజుల రామారం ప్రాంతాల్లోనూ వర్షం కురిసింది. 

 మేడ్చల్ జిల్లాలోని నాగారం మున్సిపాలిటీ, ఘట్కేసర్ మున్సిపాలిటీల్లో, కీసర, ఘట్కేసర్ మండలాల్లో చిరు జల్లులు కురిశాయి. ఆదిలాబాద్ జిల్లాలో, కొమురంభీం జిల్లాలోని కౌటాల, చింతలమానేపల్లి, బెజ్జూర్, పెంచికల్ పేట్, ఆసిఫాబాద్ మండలాల్లో భారీ వర్షం కురుస్తోంది. మరో 12 గంటల్లో మాండూస్ తుఫాను బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణపై మాండూస్ తుఫాన్ ఎఫెక్ట్ కొనసాగుతోంది. ఈనెల 14 వరకు రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పింది.