జాతీయ రహదారిపై.. కుక్కలు కూడా సిగ్గుపడే విధంగా గలీజు పనులు : భోపాల్ పొలిటికల్ లీడర్ అరెస్ట్

జాతీయ రహదారిపై.. కుక్కలు కూడా సిగ్గుపడే విధంగా గలీజు పనులు : భోపాల్ పొలిటికల్ లీడర్ అరెస్ట్

జాతీయ రహదారి.. వేల సంఖ్యలో వాహనాలు వెళుతుంటాయి.. అలాంటి రోడ్డుపై కారు ఆపాడు.. ఆ వెంటనే ఓ మహిళ కారు వెనక డోర్ నుంచి బయటకు వచ్చింది.. ముందు సీట్లో నుంచి మనోడు దిగాడు.. ఆ వెంటనే అశ్లీలమైన పనులు.. గలీజు పనులు.. రోడ్లపైనే ఆ మహిళతో.. అసభ్యకరమైన భంగిమలో.. ఆ పొలిటికల్ లీడర్ వ్యవహరించిన తీరు సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఇలాంటి ఆలోచన రావటమే దుర్మార్గమని.. నడి రోడ్డుపై.. అందులోనూ జాతీయ రహదారిపై ఇలాంటి గలీజు పనులు చేయటం ఏంటనే చర్చ జోరుగా సాగుతుంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వెలుగులోకి వచ్చిన ఈ ఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మధ్యప్రదేశ్ రాష్ట్రం మాండసౌర్ ప్రాంతానికి చెందిన మనోహర్ లాల్ ధాకడ్.. ఓ పొలిటికల్ పార్టీకి చెందిన వ్యక్తి. ఇతను తన కారులో.. ఓ మహిళతో ఢిల్లీ.. ముంబై హైవేపై వెళుతున్నాడు. మాంచి పార్టీ మూడ్ లో ఉన్నట్లు ఉన్నాడు.. ఓ టోల్ బూత్ సమీపంలో.. రోడ్డుపైనే కారు ఆపాడు. ఆ వెంటనే ఓ మహిళ కారు దిగిన వెంటనే.. మన మనోహర్ లాల్ కూడా కారు దిగాడు. ఆ మహిళతో.. అసభ్యకర భంగిమలో.. రోడ్డుపైనే అశ్లీలకరమైన చర్యకు దిగాడు. ఆ తర్వాత.. అర్థ నగ్నంగా ఉన్న మహిళతో.. రోడ్డుపైనే డాన్సులు చేశాడు. వీడి చేష్టలు అన్నీ సమీపంలోని టోల్ బూత్ కు చెందిన సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. 

ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు కొందరు. ఆ వెంటనే వైరల్ అయ్యింది. మధ్యప్రదేశ్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. మనోహర్ లాల్ బీజేపీకి చెందిన వ్యక్తి అంటూ సోషల్ మీడియాలో పోస్టులు దర్శనం ఇచ్చాయి. దీనిపై మధ్యప్రదేశ్ మాండసోర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు రాజేష్ దీక్షిత్ స్పందించాడు. మనోహర్ లాల్ బీజేపీకి పార్టికి చెందిన వ్యక్తి కాదంటూ ఖండించారు.

ఈ ఘటనపై పోలీసులు కేసులు పెట్టారు. BNS.. భారతీయ న్యాయ సింహిత సెక్షన్లు 296, 285, 3(5) కింద కేసులు నమోదు చేశారు. అతన్ని అరెస్ట్ చేశారు. యువతిని మాత్రం అరెస్ట్ చేయలేదు. మహిళను అరెస్ట్ చేసే ముందు విచారణ చేయాల్సి ఉందని.. ఆ తర్వాతనే చర్యలు తీసుకోవటం జరుగుతుందని భాన్ పురా పోలీస్ స్టేషన్ ఇంచార్జి, ఈ ఇష్యూను విచారణ చేస్తున్న అధికారి ఆర్సీ డాంగి మీడియాకు వెల్లడించారు. 

జాతీయ రహదారిపై.. నడి రోడ్డుపై ఓ మహిళతో అసభ్యకరమైన అశ్లీల చర్యకు దిగిన పొలిటికల్ లీడర్ వ్యవహారాన్ని నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ఎంత బరితెగిస్తే ఇలాంటి పనులు చేస్తారు అంటూ తిట్టిపోస్తున్నారు. కుక్కలు కూడా సిగ్గుపడే విధంగా వీడి చర్యలు ఉన్నాయంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటోళ్లకు గట్టిగా బుద్ది చెప్పాలని లేకపోతే వీళ్లను చూసి మరికొందరు పుట్టుకొస్తారంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. 

నెటిజన్ల నుంచి వస్తున్న ఒత్తిడితో ఎట్టకేలకు మనోహర్ లాల్ ధకడ్ ను అయితే అరెస్ట్ చేశారు పోలీసులు. అతని కారును స్వాధీనం చేసుకున్నారు. సంపూర్ణ విచారణ చేపడుతున్నారు పోలీసులు.