మాంగళ్య షాపింగ్ మాల్ ప్రారంభం

మాంగళ్య షాపింగ్ మాల్ ప్రారంభం

 హైదరాబాద్​, వెలుగు :  ఫ్యాషన్​ రిటైలర్​ మాంగళ్య షాపింగ్ మాల్ హైదరాబాద్​లోని హస్తినాపురంలో షాపింగ్​మాల్​ను ఆదివారం ఓపెన్​ చేసింది. నటి రాశీ ఖన్నా దీనిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ  వివాహది వేడుకలకు, అన్ని శుభాకార్యక్రమాలకు మాంగళ్య షాపింగ్ మాల్ అనుకూలమైనదని చెప్పారు. తనతోపాటు తన బంధుమిత్రులు కూడా ఇక్కడే షాపింగ్ చేస్తారని పేర్కొన్నారు. 

మాంగళ్య షాపింగ్ మాల్ చైర్మన్ కాసం నమశ్శివాయ మాట్లాడుతూ తెలుగు ప్రజలకు నాణ్యమైన వస్త్రాలు సరసమైనా ధరలకు అందిస్తున్నామని చెప్పారు. రెండు రాష్ట్రాలలో స్టోర్లు నిర్వహిస్తున్నామని, ఇది తమకు 18వ స్టోర్​ అని అన్నారు. బీఎన్​ రెడ్డి నగర్ డివిజన్ కార్పొరేటర్ లచ్చిరెడ్డి మాట్లాడుతూ మాంగళ్య షాపింగ్ మాల్ తన డివిజన్ లో ప్రారంభం కావడం ఆనందంగా ఉందన్నారు.