
మంగపేట, వెలుగు: భారత్–పాక్‌యుద్ధంలో సాహసాన్ని ప్రదర్శిస్తున్న వీర జవాన్లకు కృతజ్ఞతలు తెలుపుతూ, వీర మరణం పొందిన సైనికులకు నివాళులర్పిస్తూ సైన్యానికి మద్దతుగా ఆదివారం భారీ బైక్‌ర్యాలీ నిర్వహించారు. ములుగు జిల్లా మంగపేట మండలం అకినపెళ్లిమల్లారం నుంచి కమలాపురం వరకు సుమారు 500 బైక్ లతో 40 కిలోమీటర్ల ర్యాలీ నిర్వహించారు.
ఈ ర్యాలీలో 25 గ్రామాల నుంచి ప్రజలు స్వచ్చదంగా పాల్గొన్నారు. రాజుపేట, కమలాపురం అంబేద్కర్ సెంటర్ లో మానవహారం చేశారు. ఈ ర్యాలీలో కొడవలి రఘు, వత్సవాయి శ్రీధర్ వర్మ, తాటి కృష్ణ, ఆక రవి, గోనె మధుసూదాన్ రావుతోపాటు మహిళా, ఉద్యోగ, యువజన, ఆదివాసి సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.