మణిరత్నం నుంచి సినిమా వస్తోందంటే అనౌన్స్‌మెంట్ డే నుంచే ఓ క్యూరియాసిటీ ఉంటుంది. కమల్ హాసన్‌తో ఆయన తీసిన ‘థగ్ లైఫ్’ నిరాశపరిచినప్పటికీ తర్వాతి చిత్రం ఎవరితో ఉండబోతోందా అని గత కొద్ది నెలలుగా రకరకాల వార్తలు వినిపించాయి. వీటన్నింటికీ ఫుల్స్టాప్ పెడుతూ సైలెంట్‌గా తన సినిమాను అనౌన్స్ చేశారు మణిరత్నం.
విజయ్ సేతుపతి హీరోగా నటించనున్న ఈ చిత్రంలో సాయిపల్లవి హీరోయిన్‌గా నటించబోతోంది. లైకా ప్రొడక్షన్స్‌తో కలిసి మణిరత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించబోతున్నారు.
తమ క్రేజీ కాంబినేషన్‌ను పక్కనపెట్టి కొత్త సంగీత దర్శకుడితో ఆయన ఈ సినిమా చేయబోతున్నట్టు వార్తలొచ్చాయి. కానీ మణిరత్నం మాత్రం రెహమాన్‌తో కంటిన్యూ అవుతున్నారు.ఇక ఆయన డైరెక్షన్‌లో నటించడం సాయిపల్లవికి ఇదే తొలిసారి. విజయ్ సేతుపతి మాత్రం మణిరత్నం తీసిన ‘నవాబ్’లో నటించాడు. రొమాంటిక్ లవ్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ ప్రాజెక్ట్ ఉండబోతోందని తెలుస్తోంది.
Delighted to welcome @sonymusicsouth as the Audio Partner for #MadrasTalkiesProduction23 💫#Subaskaran presents
— Lyca Productions (@LycaProductions) March 20, 2026
A #ManiRatnam Film
An @arrahman Musical
Produced by @LycaProductions @MadrasTalkies_#IndiaTalkies
Starring @VijaySethuOffl @Sai_Pallavi92 pic.twitter.com/li6hnVEJGJ
