త్రిపుర ముఖ్యమంత్రిగా మాణిక్ సాహా ప్రమాణ స్వీకారం

త్రిపుర ముఖ్యమంత్రిగా మాణిక్ సాహా ప్రమాణ స్వీకారం

రాష్ట్రంలో జరిగింది సీఎం మార్పే తప్పా.. రాజకీయ మార్పు కాదన్నారు త్రిపుర కొత్త సీఎం మాణిక్ సాహా. ప్రధాని మోదీ సారధ్యంలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. త్రిపుర 11వ ముఖ్యమంత్రిగా మాణిక్ సాహా.. ప్రమాణ స్వీకారం చేశారు. అగర్తలలోని రాజ్ భవన్ లో ఆయన చేత గవర్నర్ సత్యదేవ్ నరేన్ ఆర్య ప్రమాణం చేయించారు. సీఎంతో పాటు పలువురు నేతలు మంత్రులుగా ప్రమాణం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను పరిరక్షించడానికి కృషి చేస్తామన్నారు కొత్త సీఎం మాణిక్ సాహా.

శనివారం సీఎం పదవికి బిప్లవ్ కుమార్ దేవ్ రాజీనామా చేశారు. పార్టీ జాతీయ నాయకత్వం జారీ చేసిన ఆదేశాల మేరకు ఆయన రాజీనామా చేశారు. అనంతరం బీజేఎల్పీ (BJLP) అత్యవసరంగా సమావేశమై  మాణిక్ సాహను నూతన సీఎంగా ఎన్నుకున్నారు. బీజేపీ త్రిపుర శాఖ అధ్యక్షులుగా కొనసాగుతున్న సాహ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు.