
- బీసీ సంక్షేమ సంఘం మహిళా విభాగం అధ్యక్షురాలు మణిమంజరి
ముషీరాబాద్, వెలుగు : జనవరి 3న సావిత్రి బాయి ఫూలే జయంతి వేడుకలను రవీంద్ర భారతిలో ఘనంగా నిర్వహిస్తామని ఉత్సవ కమిటీ చైర్మన్, బీసీ సంక్షేమ సంఘం మహిళా విభాగం అధ్యక్షురాలు మణిమంజరి పేర్కొన్నారు. మంగళవారం దోమలగూడలోని బీసీ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. సావిత్రిబాయి ఫూలేను ప్రతి మహిళ ఆదర్శంగా తీసుకోవాలన్నారు.
సావిత్రిబాయి జయంతి కార్యక్రమానికి మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆమె కోరారు. సమావేశంలో మహిళా సంఘం నాయకురాలు తారకేశ్వరి, సమత, సంధ్యారాణి పాల్గొన్నారు.