లిక్కర్ స్కాం.. 24 గంటల్లోగా కేజ్రీ సమాధానం చెప్పు

లిక్కర్ స్కాం.. 24 గంటల్లోగా కేజ్రీ సమాధానం చెప్పు

ఢిల్లీలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. బీజేపీ, ఆప్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మద్యం పాలసీలో అవకతవకల కేసులో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సిసోడియా ఇంట్లో సీబీఐ అధికారులు సోదాలు జరపడం చర్చనీయాంశమైంది. తాను దేనికీ భయపడబోమని, 2024లో జరిగే ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ. బీజేపీకి మధ్యే పోటీ ఉంటుందని సిసోడియా వెల్లడించారు. దీనికి కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కౌంటర్ ఇచ్చారు. ఆయన పేరును M O N E Y SHH గా మార్చుకోవాలని సూచించారు. డబ్బులు వసూలు చేస్తూ మౌనం వహిస్తాడని విమర్శించారు. మద్యం కుంభకోణంలో మనీష్ సిసోడియా తొలి నిందితుడే అయినా..స్కాం ప్రధాన సూత్రధారి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అంటూ ఆరోపణలు గుప్పించారు. 

మద్యం పాలసీ సరైనదైతే ఎందుకు వెనక్కి తీసుకున్నారని ప్రశ్నించారు. సీఎం కేజ్రీవాల్ 24 గంటల్లోగా తనకు జవాబివ్వాలని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ సవాల్ విసిరారు. ఎక్సైజ్ పాలసీ 2021-22 అమలులో అవకతవకలకు సంబంధించి సిసోడియా నివాసంలో కొన్ని గంటల పాటు సీబీఐ సోదాలు జరిపింది. నమోద చేసిన ఎఫ్ఐఆర్ లో నమోదు చేసిన 15 మందిలో ఆయన పేరు కూడా ఉంది. అరవింద్ కేజ్రీవాల్ ఇమేజ్ ను దెబ్బ తీసేందుకే బీజేపీ ఇలాంటి ప్రయత్నాలు చేస్తోందని, ఈ క్రమంలో తన నివాసం, కార్యాలయాల్లో దాడులు చేయిస్తున్నారని సిసోడియా ఆరోపించారు. ఎలాంటి అవినీతికి పాల్పడలేదని మరోసారి చెప్పారు. ఢిల్లీలో మద్యం పాలసీ అత్యుత్తమమైందన్నారు.