
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ అయిన ఆప్ నేత, ఆ రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా బెయిల్ కోసం శుక్రవారం ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్‌ను స్పెషల్ జడ్జి ఎంకే నాగ్‌పాల్ శనివారం విచారించనున్నట్లు సిసోడియా అడ్వకేట్ రిషికేశ్ వెల్లడించారు. లిక్కర్ స్మామ్‌లో అరెస్టయిన సిసోడియాకు కోర్టును ఐదు రోజుల కస్టడీ విధించింది. దీంతో సీబీఐ అదుపులోకి తీసుకుంది. శనివారంతో సీబీఐ రిమాండ్ ముగియనుండడంతో అదే రోజు సిసోడియాను కోర్టులో హాజరుపర్చనున్నారు. కేసు విచారణతో పాటు బెయిల్ పిటిషన్‌పైనా విచారణ జరగనుంది.
‘ఐ లవ్ మనీశ్ సిసోడియా’క్యాంపెయిన్..
.
మనీశ్ సిసోడియాకు మద్దతుగా ఢిల్లీ ప్రభుత్వం గవర్నమెంట్ స్కూళ్లల్లో ‘ఐ లవ్ మనీశ్ సిసోడియా’అనే డెస్క్‌లను ఏర్పాటు చేయబోతున్నదని ఢిల్లీ బీజేపీ నేతలు ఆరోపించారు. సిసోడియా అరెస్ట్ తర్వాత కూడా ఢిల్లీ ప్రభుత్వం చదువుల పేరుతో నీచ రాజకీయాలు చేసుడు ఆపలేదని మండిపడ్డారు. ఇవన్నీ తప్పుడు ఆరోపణలేనని ఆప్ ఖండించింది.