మాజీ ప్రధానులు ఇద్దరూ మాజీ ఎంపీలయ్యారు

మాజీ ప్రధానులు ఇద్దరూ మాజీ ఎంపీలయ్యారు

న్యూఢిల్లీ: 17వ లోక్‌ సభ తొలి బడ్జె ట్‌ సమావేశాల్లో ఇద్దరు ప్రధానులు పాల్గొనబోడవంలేదు.మన్మోహన్‌ సింగ్‌‌‌‌‌‌‌‌ రాజ్యసభ పదవీకాలం ముగి యడం, మారో మాజీ పీఎం దేవెగౌడ్‌  మొన్నటి లోక్‌ సభ ఎన్నికల్లో ఓడిపోవడంతో వాళ్లిద్దరూ పా ర్లమెంట్‌ బడ్జె ట్‌ సమావేశాల్లో తమ వాణిని వినిపించేందుకు అవకాశం లేకుండా పోయింది. దేవేగౌడ సుమారు 20 ఏళ్ల  పాటు లోక్‌సభకు వరుసగా ఎన్నికవుతున్నారు. గతంలో రెండు సార్లు మాత్రమే ఓడిపోయారు. మరోవైపు మన్మోహన్‌ సింగ్‌‌‌‌‌‌‌‌ 30 ఏళ్లపాటు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఆయన పదవీ కాలం ఈ శుక్రవారంతో ముగిసింది. మరో మాజీ పీఎం దేవెగౌడ  ఈమధ్యనే ముగిసిన లోక్‌ సభ ఎన్నికల్లో కర్నాటకలోని తుమకూరు నుంచి పోటీచేసి ఓడిపోయారు.

దేవెగౌడ

కర్నాటకకు చెందిన దేవెగౌడ దేశానికి 11వ ప్రధాని.  జూన్‌‌‌‌‌‌‌‌ 1996 నుంచి ఏప్రిల్‌‌‌‌‌‌‌‌ 1997 వరకు ఆయన ఆ పదవిలో ఉన్నారు. మొన్నటి లోక్‌‌‌‌‌‌‌‌సభ ఎన్నికల్లో తుమకూరు నుంచి పోటీ చేసి బీజేపీ కేండిడేట్‌‌‌‌‌‌‌‌ జీఎస్‌‌‌‌‌‌‌‌ బసవరాజ్‌‌‌‌‌‌‌‌ చేతిలో 13 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. జేడీఎస్‌‌‌‌‌‌‌‌కు కంచుకోటగా ఉన్న హసన్‌‌‌‌‌‌‌‌ నుంచి ఇంతకుముందు పోటీచేసిన దేవెగౌడ..  మనవడు ప్రజ్వల్‌‌‌‌‌‌‌‌ రేవన్నా కోసం ఆ సీటును  వదలుకున్నారు.  తుమకూరును ఎంచుకున్నారు. హసన్‌‌‌‌‌‌‌‌లో రేవన్నా  ఘన విజయం సాధించారు. బీజేపీ కేండిడేట్‌‌‌‌‌‌‌‌ మంజును లక్షా 41 వేల ఓట్ల తేడాతో ఓడించారు.  తాత కోసం హసన్‌‌‌‌‌‌‌‌ సీటుకు రాజీనామా చేస్తానని  రేవన్నా  ప్రకటించారు. అయితే దానికి దేవెగౌడ ఎంతమాత్రం ఒప్పుకోలేదు. ‘‘ మాజీ ప్రధానిగా నేను రెండుసార్లు ఓడిపోయాను. ఇది పెద్ద ఇష్యూ కాదు. జేడీఎస్‌‌‌‌‌‌‌‌ అనే రీజినల్‌‌‌‌‌‌‌‌పార్టీని ఎలా కాపాడుకోవాలన్నదే నాకు ముఖ్యం.  కిందస్థాయిలో పార్టీని బలోపేతం చేయడమే నా ముందున్న కర్తవ్యం.  నా ఓటమికి ఎవర్నీ  నిందించను’’ అని  ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత దేవెగౌడ కామెంట్ చేశారు.  కర్నాటకలో 28 లోక్‌‌‌‌‌‌‌‌సభ సీట్లకుగాను బీజేపీ 25 స్థానాల్లో భారీ విజయాన్ని నమోదుచేసింది. కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌, జేడీఎస్‌‌‌‌‌‌‌‌, ఇండిపెండెంట్‌‌‌‌‌‌‌‌ అభ్యర్థులు ఒక్కోస్థానంలో మాత్రమే గెలిచారు.

మన్మోహన్‌‌‌‌‌‌‌‌సింగ్‌‌‌‌‌‌‌‌

దేశానికి 2004 నుంచి 2014 వరకు ప్రధానిగా ఉన్న మన్మోహన్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌ రాజ్యసభకు ఐదుసార్లు ఎన్నికయ్యారు.  ఈ శుక్రవారంతో ఆయన రాజ్యసభ సభ్యత్వం పూర్తయింది.  అస్సాం నుంచి 1991 లో  తొలిసారిగా రాజ్యసభలోకి అడుగుపెట్టిన ఆయన 30 ఏళ్లపాటు పెద్దలసభలో ఎంపీగా కొనసాగారు. ఆ రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌కు చాలినంత బలం లేకపోవడంతో రాజ్యసభకు ఆయన ఎంపిక సాధ్యంకాలేదు.  అస్సాంలో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌కు 25 మంది ఎమ్మెల్యేలున్నారు.   43 మంది ఎమ్మెల్యేల సపోర్ట్‌‌‌‌‌‌‌‌ ఉంటేకాని రాజ్యసభకు ఎన్నిక కావడం అసాధ్యం.ఇతర రాష్ట్రాల్లో ఖాళీ ఉన్నా అక్కణ్నుంచి రాజ్యసభకు ఎంపికయ్యేందుకు సరిపడినంత మెజార్టీ లేకపోవడంతో మన్మోహన్‌‌‌‌‌‌‌‌సింగ్‌‌‌‌‌‌‌‌ను  కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ ఈసారి  నామినేట్‌‌‌‌‌‌‌‌చేయలేకపోయింది. దేశంలో ఇప్పుడు తొమ్మిది రాజ్యసభ సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఒడిశాలో నాలుగు, తమిళనాడులో ఒకటి, బీహార్‌‌‌‌‌‌‌‌, గుజరాత్‌లో రెండు చొప్పున ఖాళీ అయిన రాజ్యసభ ఎంపీ సీట్లకు ఎన్నికలు జరగాల్సి ఉంది.  గుజరాత్‌‌‌‌‌‌‌‌లో మినహా  మిగిలిన రాష్ట్రాల నుంచి  గెలవడానికి అవసరమైన సంఖ్యాబలం కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌కు లేదు. కర్నాటక, చత్తీస్‌‌‌‌‌‌‌‌గఢ్‌‌‌‌‌‌‌‌, రాజస్థాన్‌‌‌‌‌‌‌‌, పంజాబ్‌‌‌‌‌‌‌‌ కోటాలో మన్మోహన్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌ను ఎంపికచేయొచ్చుగాని… ఈ రాష్ట్రాల్లో ఖాళీలు లేవు.