వీల్ చైర్లో పార్లమెంట్కు వచ్చిన మన్మోహన్ సింగ్ 

వీల్ చైర్లో పార్లమెంట్కు వచ్చిన మన్మోహన్ సింగ్ 

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రజాస్వామిక స్ఫూర్తి అందరినీ ఆకట్టుకుంది. 89 ఏళ్ల మన్మోహన్ సింగ్ తొలిసారిగా వీల్ చైర్‌లో పార్లమెంటు భవనంలో కనిపించారు. రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా మన్మోహన్ సింగ్  పార్లమెంట్ కు వీల్‌చైర్‌లో వచ్చి ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. పార్లమెంట్‌లో ఏర్పాటు చేసిన రహస్య బ్యాలెట్ బాక్సులో ఆయ‌న ఓటేశారు. ఎన్నికల సిబ్బంది సహాయంతో ఎంపీ మ‌న్మోహ‌న్ ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. రాష్ట్రప‌తి ఎన్నిక‌లో ఎన్డీఏ అభ్యర్థిగా ద్రౌపది ముర్ము, విప‌క్షాల అభ్యర్థిగా య‌శ్వంత్ సిన్హా పోటీప‌డుతున్న విష‌యం తెలిసిందే. కరోనా, అనారోగ్యం కారణంగా మన్మోహన్ సింగ్ నడవలేని స్థితిలో ఉన్నారు.

మరో ప్రముఖ నాయకుడు, సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ కూడా తన సోదరుడు రామ్ గోపాల్ యాదవ్‌తో కలిసి చక్రాల కుర్చీలో ఓటు వేయడానికి వచ్చారు. 82 ఏళ్ల యాదవ్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.  ఒడిశా అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, బీజేపీ నేత ప్రదీప్త కుమార్ నాయక్ కూడా ఆసుపత్రి నుంచి నేరుగా ఆక్సిజన్ సిలిండర్‌తో చక్రాల కుర్చీపై వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రదీప్త కుమార్ కు కోవిడ్ రావడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. కరోనా తగ్గినా. కొన్ని ఆరోగ్య సమస్యల నిమిత్తం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.