
సంగారెడ్డి జిల్లా మోగడంపల్లి మండలం మన్నాపూర్ VRO ఏసీబీకి చిక్కాడు. పట్టాదారు పాసుపుస్తకం కోసం రైతు నుంచి లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు VROను పట్టుకున్నారు. సంగారెడ్డి జిల్లా మన్నాపూర్ కు చెందిన రైతు అశోక్ రెడ్డి కొత్త పాసు పుస్తకం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అయితే పాసు పుస్తకం ఇచ్చేందుకు గ్రామ VRO ఆయుబ్ అబ్దుల్ 15 వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో రైతు అశోక్ రెడ్డి ACB అధికారులను ఆశ్రయించారు. దీంతో VRO ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ACB అధికారులు.