
మన్నెగూడ యువతి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడు నవీన్‌రెడ్డి సోదరుడు నందీప్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. తనకు సంబంధించిన వీడియోలను నందీప్ రెడ్డి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేశారని బాధిత యువతి ఆదిభట్ల పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నందీప్ ను అరెస్టు చేశారు.
గోవాలో నవీన్ రెడ్డి వీడియోలను రికార్డు చేసి మీడియాకు పంపిన వారిలో నందీప్ రెడ్డి తో పాటు వంశీ భరత్‌రెడ్డి అనే మరో వ్యక్తి కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.దీంతో అతడిని కూడా అరెస్టు చేశారు. మీడియాలో బాధిత యువతి వీడియోలను ప్రసారం చేయొద్దని పోలీసులు సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.