సీఎం పదవికి మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామా

సీఎం పదవికి  మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామా

హర్యానా రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది.  సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ఇవాళ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను మార్చి 12వ తేదీ మంగళవారం రోజున గవర్నర్‌కు సమర్పించారు.  బీజేపీ, జేజేపీ కూటమిలో ఇబ్బందులు రావడంతో ఖట్టర్ పదవి నుంచి తప్పుకున్నారు. అసెంబ్లీలో సంపూర్ణ మోజారిటీ కలిగిన బీజేపీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఖట్టర్ స్థానంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయాబ్ సైనీ లేదా సంజయ్ భాటియాలకు సీఎం పదవి దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది.  రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కర్ణ లోక్‌సభ స్థానం నుంచి ఖట్టర్‌ బరిలోకి దిగే అవకాశం ఉంది.   ఈ ఏడాది హర్యానా అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరగనున్నాయి 

హర్యానాలో లోక్‌సభ ఎన్నికల సీట్ల పంపకంపై బీజేపీ-జేజేపీ కూటమిలో విభేదాలు తలెత్తాయి.  బీజేపీకి చెందిన హిసార్ ఎంపీ బ్రిజేంద్ర సింగ్ కాంగ్రెస్‌లో చేరిన తర్వాత సంక్షోభం మరింత తీవ్రమైంది .  90 మంది సభ్యులున్న హర్యానా అసెంబ్లీలో  ప్రభుత్వ ఏర్పాటకు46 సీట్లు అవసరం.  2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీకి మెజారిటీ తక్కువ రావడంతో బీజేపీ, జేజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. బీజేపీకి 41 మంది ఎమ్మెల్యేలు ఉండగా, ఆరుగురు స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతు ఉంది. జేజేపీకి 10 మంది ఎమ్మెల్యేలు ఉండగా, కాంగ్రెస్‌కు 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.