హెచ్‌సీఏ తాత్కాలిక ప్రెసిడెంట్‌గా మనోజ్‌!

హెచ్‌సీఏ తాత్కాలిక ప్రెసిడెంట్‌గా మనోజ్‌!
  • తానే ప్రెసిడెంట్‌ అంటున్న అజర్

హైదరాబాద్‌, వెలుగు: హెచ్‌సీఏలో వర్గ పోరు తారస్థాయికి చేరుకుంది. ప్రెసిడెంట్‌ మహ్మద్ అజరుద్దీన్‌ను సస్పెండ్ చేసిన హెచ్‌సీఏ అపెక్స్‌ కౌన్సిల్‌ ఇప్పుడు మరో అడుగు ముందుకేసింది. ప్రస్తుత వైస్‌ ప్రెసిడెంట్‌ జాన్‌ మనోజ్‌ను తాత్కాలిక ప్రెసిడెంట్‌గా ఎంపిక చేసింది. ఈ మేరకు ఎమర్జెన్సీ అపెక్స్‌ కౌన్సిల్‌లో నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. అయితే రూల్స్‌ ప్రకారం ఈ మీటింగ్‌లో జాన్‌ మనోజ్‌ను తాత్కాలిక ప్రెసిడెంట్‌గా  ఎంపిక  చేయడం చట్ట విరుద్ధం అని అజర్ పేర్కొన్నాడు.  హెచ్‌సీఏకు తానే  ప్రెసిడెంట్‌ అని, అపెక్స్‌ కౌన్సిల్‌లో మనోజ్‌ సహా ఐదుగురు మెంబర్స్‌ సస్పెండ్ అయ్యారని స్పష్టం చేశాడు. మరోవైపు అజర్ అంగీకరించనప్పటికీ సెక్రటరీ విజయానంద్‌ వర్గం నియమించిన సీఈవో సునీల్‌ కాంటే  బాధ్యతలు స్వీకరించానని అంటున్నాడు. అయితే, అతని అపాయింట్‌మెంట్‌ను సవాల్‌ చేస్తూ వేసిన పిటిషన్‌ను మూడో అడిషన్‌ సివిల్‌ జడ్జ్‌ విచారణకు స్వీకరించారని అజర్ వర్గం చెబుతోంది.