
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ టికెట్ల కేటాయింపుల విషయంలో పార్టీ నేతలెవరూ బహిరంగ విమర్శలు చేయవద్దని ఏఐసీసీ కార్యదర్శి మన్సూర్ అలీఖాన్ సూచించారు. సీట్లపై ఇంకా సంప్రదింపులు కొనసాగుతున్నాయని మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
టికెట్ల విషయంలో ఏ నాయకుడు పార్టీకి, నాయకులకు వ్యతిరేకంగా బయట మాట్లాడొద్దన్నారు. పత్రిక సమావేశాలు, ప్రకటనలు ఇవ్వరాదని స్పష్టం చేశారు. ఇప్పటికీ టికెట్ల కేటాయింపుల విషయంపై కొందరు ప్రెస్ మీట్స్ పెట్టి మాట్లాడుతున్నారని, అలా చేయడం పార్టీ విధానాలకు వ్యతిరేకమని చెప్పారు.