త్రిష, చిరంజీవిపై పరువు నష్టం దావా వేస్తా!..మన్సూర్ అలీఖాన్ సంచలన నిర్ణయం

త్రిష, చిరంజీవిపై పరువు నష్టం దావా వేస్తా!..మన్సూర్ అలీఖాన్ సంచలన నిర్ణయం

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తమిళ నటుడు మన్సూర్ అలీఖాన్ (Mansoor Ali Khan)..లియో సినిమాలో హీరోయిన్ త్రిష(Trisha)తో  ఓ సీన్‌ గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన విషయం ఎంత వైరల్ అయిందో తెలిసిందే. మన్సూర్ మాట్లాడుతూ..గతంలో ఎన్నో చిత్రాల్లో నేను రేప్‌ సీన్లలో నటించా. లియోలో ఆఫర్‌ వచ్చినప్పుడు త్రిషతోనూ అలాంటి సీన్‌ ఉంటుందని అనుకున్నా. కాకపోతే, అలాంటి సీన్‌ లేకపోవడం బాధగా అనిపించిందని మన్సూర్‌ అలీఖాన్‌ అన్నాడు.

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా..సీనీ ప్రముఖులంతా ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ వచ్చారు. ఈ విషయం ఇండియా లెవెల్లో వైరల్ అవ్వడంతో మహిళా కమిషన్ కూడా స్పందించింది. చివరికి మన్సూర్ క్షమాపణలు చెప్పడం..త్రిష పాజిటివ్గా స్పందిస్తూ..ఈ వివాదానికి ముగింపు పలకడం జరిగింది. ఇక ఈ వివాదం సద్దు మణిగింది అనుకునే లోపే..మన్సూర్ మారోసారి సెన్సషనల్ వ్యాఖ్యలతో తెరపైకి వచ్చాడు. 

ఆ ముగ్గురిపై కేసు:

లేటెస్ట్ గా మన్సూర్ ఇదే విషయంపై స్పందిస్తూ..మెగాస్టార్ చిరంజీవిపై పరువు నష్టం దావా, క్రిమినల్ కేసు వేయనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా..చిరంజీవితో పాటు నటి ఖుష్బు, త్రిష లపై పరువునష్టం, పరిహారం, క్రిమినల్, సివిల్ దావా, ముందస్తు అల్లర్లు, నగరంలో 10 రోజులపాటు ప్రజా శాంతికి విఘాతం కలిగించడం, వీరు తమ మాటలతో తనను హింసించారని..అలాగే ఇతరులను రెచ్చగొట్టడం వంటి అన్ని కేటగిరీల కింద కేసు నమోదు చేయబోతున్నట్లు నటుడు మన్సూర్ అలీఖాన్ ప్రకటించారు. తన లాయర్ గురు ధనంజయన్ ద్వారా రేపు కోర్టులో కేసు వేయబోతున్నట్లు వెల్లడించారు. త్వరలో వారి ముగ్గురికి నోటీసులు జారీ చేస్తానని మన్సూర్ ప్రకటించాడు. ఎవరో కావాలనే వైరల్ చేసిన వీడియోని తన ప్రసంగానికి ముందు, తర్వాత కొందరు ఎడిట్ చేసి త్రిషను అసభ్యకరంగా మాట్లాడినట్లు చిత్రీకరించారన్నారు. ఈ కేసులో తాను నిజమైన వీడియోను పంపానని, అలాగే మరికొన్ని ఆధారాలతో కేసుని వేయబోతున్నట్లు మన్సూర్ మరోసారి నొక్కి చెప్పారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ఈ విషయంలో త్రిషకు సపోర్ట్గా..చిరంజీవి, లోకేష్ కనగరాజ్, నాగ చైతన్య, మాళవిక మోహనన్, నితిన్ నిలిచారు. మన్సూర్ చేసిన కామెంట్స్ దారుణమని తప్పుబట్టారు. 

త్రిష..మన్సూర్ వివాదంపై చిరు ఏమన్నాడంటే:

ఇదే విషయంపై చిరంజీవి ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ..త్రిష గురించి నటుడు మన్సూర్ అలీఖాన్ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు నా దృష్టికి వచ్చాయి. ఇలాంటి వ్యాఖ్యలు ఒక ఆర్టిస్ట్ కి మాత్రమే కాదు ఏ స్త్రీని కూడా అనకూడదు.  ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించాలి. వక్రబుద్ధితో ఇలాంటివి మాట్లాడుతున్నారు. త్రిషకు మాత్రమే కాదు, ఇలాంటి వ్యాఖ్యలు ఏ అమ్మాయికి వచ్చినా నేను అండగా, సపోర్ట్ గా నిలబడతాను అని ట్వీట్ చేశారు చిరు.  ఏకంగా మెగాస్టార్ చిరంజీవి త్రిష అంశంపై స్పందించడంతో ఈ వివాదం మరింత పెద్దగా మారింది.