బయటోళ్లకు డబుల్ ఇండ్లు ఎట్లిస్తరు?

బయటోళ్లకు డబుల్ ఇండ్లు ఎట్లిస్తరు?

ఎల్​బీనగర్,వెలుగు:  పేదలను కాదని.. ఎక్కడి నుండో వచ్చినోళ్లకు డబుల్ బెడ్రూమ్​ ఇండ్లు ఇస్తున్నారని నాగోల్ డివిజన్ పరిధి ఎరుకల నాంచారమ్మ బస్తీ వాసులు శుక్రవారం సాయంత్రం బైఠాయించి ఆందోళనకు దిగారు. బల్దియా పరిధిలో లాటరీ ద్వారా డబుల్ ఇండ్లకు ఎరుకల నాంచారమ్మ బస్తీ వాసులను ఎంపిక చేయకపోవడం బాధాకరమని బస్తీ సంఘం నేత జగన్నాథం గంగయ్య ఆవేదన వ్యక్తం చేశారు.

  ఎరుకల నాంచారమ్మ బస్తీలో నిర్మించిన 288 డబుల్ ఇండ్లలో 200 పంపిణీ చేశారని, మిగిలిన ఇండ్లను స్థానికంగా ఉండే వారికి ఇవ్వాలని లేదంటే ఇచ్చేదాకా పోరాడుతామని ఆయన హెచ్చరించారు. ఇండ్లపై స్థానిక ఎమ్మెల్యేను పలుమార్లు కలిసి విన్నవించామని, రంగారెడ్డి కలెక్టర్, రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోయిందని వాపోయారు. స్థానికంగా ఉంటున్న వారి ధ్రువ పత్రాలు పరిశీలన చేసి, అర్హులకు ఇండ్లు ఇవ్వాలని కోరారు. ఈ ధర్నాలో లింగయ్య, స్వామి, సిద్దు, మల్లేష్, పాపమ్మ, మరో 100 మంది బాధితులు పాల్గొన్నారు.