కల్తీ మందులు తయారు చేస్తే కఠిన చర్యలు తప్పవు : మన్​సుఖ్​ మాండవియా

కల్తీ మందులు తయారు చేస్తే కఠిన చర్యలు తప్పవు : మన్​సుఖ్​ మాండవియా
  • ఫార్మా కంపెనీలకు మినిస్టర్​ వార్నింగ్​

న్యూఢిల్లీ: కల్తీ మందులు తయారు చేసే కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలని డ్రగ్స్​ కంట్రోలర్​​ జనరల్​ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) ను ఆదేశించినట్లు కెమికల్స్​, ఫెర్టిలైజర్స్​ మినిస్టర్​ మన్​సుఖ్​ మాండవియా చెప్పారు. క్వాలిటీ ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని పార్మాస్యూటికల్స్​ మాన్యుఫాక్చరింగ్​​ కంపెనీలకు ఆయన సూచించారు. మందుల తయారీ సక్రమంగా సాగుతోందా లేదో తనిఖీ చేయడానికి ప్రత్యేక స్క్వాడ్స్​ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

ఈ స్పెషల్​ స్క్వాడ్స్​ దేశంలోని 139 కంపెనీలను తనిఖీ చేశాయని, ఇందులో 105 కంపెనీలపై యాక్షన్​ తీసుకున్నామని అన్నారు. 31 కంపెనీలలో ప్రొడక్షన్​ నిలిపివేయాలని ఆదేశాలివ్వగా, మరో 50 కంపెనీల ప్రొడక్ట్​ లైసెన్సులు క్యాన్సిల్​ చేసినట్లు మంత్రి చెప్పారు. మరో 73 కంపెనీలకు షోకాజ్​ నోటీసులు జారీ అయ్యాయని వెల్లడించారు.  ఇండియన్​ డ్రగ్​ మాన్యుఫాక్చరర్స్​ అసోసియేషన్​ (ఐడీఎంఏ) ప్రతినిధులతో మంగళవారం మినిస్టర్​ సమావేశమయ్యారు. ఫార్మా రంగంలోని ఎంఎస్​ఎంఈలు ముఖ్యంగా క్వాలిటీ విషయంలో శ్రద్ధ వహించాలని మాండవీయ ఈ సందర్భంగా సలహా ఇచ్చారు.