ఎయిర్పోర్టుల్లో ఆర్టీ పీసీఆర్ టెస్టులు చేస్తున్నం : మన్సుఖ్ మాండవియా

ఎయిర్పోర్టుల్లో ఆర్టీ పీసీఆర్ టెస్టులు చేస్తున్నం : మన్సుఖ్ మాండవియా

కరోనా పరిస్థితిపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా లోక్ సభలో కీలక ప్రకటన చేశారు. చైనాలో శరవేగంగా వ్యాప్తి చెందుతున్న వైరస్ పై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భవిష్యత్తులో పరిస్థితి మరింత దారణంగా మారే అవకాశముందని ప్రపంచ ఆరోగ్య నిపుణుల హెచ్చరికలను ఆయన గుర్తు చేశారు. ప్రతి ఒక్కరు మాస్క్, శానిటైజర్లు తప్పని సరిగా వాడేలా రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 

కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఆరోగ్య శాఖ సిద్ధంగా ఉందని మన్సుఖ్ మాండవియా చెప్పారు. న్యూ ఇయర్ వేడుకల్లో కొవిడ్ జాగ్రత్తలు పాటించేలా చూడాలని, ప్రికాషనరీ డోసుల తీసుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎయిర్ పోర్టుల్లో విదేశీ ప్రయాణీకులకు ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయం ప్రారంభించినట్లు కేంద్రమంత్రి స్పష్టం చేశారు.  కొత్త వేరియెంట్ కనుగొనేందుకు జీనోమ్ సీక్వెన్సింగ్ జరుపుతున్నామన్న ఆయన.. ప్రపంచవ్యాప్తంగా  వైరస్ కు సంబంధించిన పరిణామాలను భారత్ గమనిస్తోందని అన్నారు.