జీడిమెట్లలో నకిలీ సన్ స్క్రీన్ లోషన్స్ తయారీ..కంపెనీ సీజ్

జీడిమెట్లలో  నకిలీ సన్  స్క్రీన్ లోషన్స్ తయారీ..కంపెనీ సీజ్

హైదరాబాద్ లో రోజురోజుకు నకిలీ ప్రొడక్స్ విచ్చలవిడిగా దర్శనమిస్తున్నాయి. తినే పధార్థాల నుంచి వాడే వస్తువుల వరకు అన్నీ కల్తీవి అమ్ముతున్నారు. అనుమతుల్లేకున్నా విచ్చలవిడిగా తయారు చేస్తున్నారు. లేటెస్ట్ గా  జీడిమెట్లలో  లైసెన్స్ లేకుండా సన్ స్క్రీన్ లోషన్స్ తయారు చేస్తున్న మ్యానుఫాక్చరింగ్ యూనిట్ ను సీజ్ చేశారు  డీసీఏ అధికారులు.

 జీడిమెట్లలో ఎస్థిటిక్ ఇన్ సైట్స్ ప్రైవేట్ లిమిటెడ్  అనే  మ్యానుఫ్యాక్షరింగ్ యూనిట్ పర్మిషన్ లేకుండా  నడుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న డీసీఏ అధికారులు  డెర్మాసోనిక్ పేరుతో తయారవుతున్న రెండున్నర లక్షల విలువైన సన్ స్క్రీన్ లోషన్స్ ను  సీజ్ చేశారు.

అలాగే  ఎమ్మార్పీ కన్నా ఎక్కువ రేట్ కి అమ్మతున్న యాంటీ ఫంగల్ మెడిసిన్ ని సీజ్ చేశారు డ్రగ్ కంట్రోల్ అధికారులు. వికారాబాద్ లో ఇట్లాకానాజోల్ మెడిసిన్ ని సీజ్ చేశారు.  నేషనల్ పార్మాసూటికల్ ప్రైసింగ్ అధారిటీ నిర్ణయించిన ధరకన్నా ఎక్కువ ధరకు మెడిసిన్ ల అమ్ముతున్నట్లు గుర్తించారు.