తయారీరంగ వృద్ధి..14 నెలల గరిష్ట స్థాయికి

తయారీరంగ వృద్ధి..14 నెలల గరిష్ట స్థాయికి

న్యూఢిల్లీ: మనదేశ తయారీ రంగం వృద్ధి గత నెల 14 నెలల గరిష్ట స్థాయికి 58.4కి పెరిగింది.  ఉత్పత్తి,  కొత్త ఆర్డర్లు, ఉపాధి పెరగడమే ఇందుకు కారణమని మంగళవారం నెలవారీ సర్వే తెలిపింది. ఈ రంగం పనితీరును కొలిచే హెచ్​ఎస్​బీసీ ఇండియా మాన్యుఫాక్చరింగ్​పర్చేజింగ్​ మేనేజర్స్​ఇండెక్స్​(పీఎంఐ) మే నెలలో 57.6గా నమోదయింది. 

ఇది 50 కంటే ఎక్కువ ఉంటే విస్తరిస్తున్నట్టు అర్థం. జూన్‌‌లో కొత్త ఆర్డర్‌‌ల ఇన్‌‌ఫ్లోలు కూడా వేగంగా పెరిగాయని, విస్తరణ రేటు దాదాపు ఒక సంవత్సరంలోనే అత్యంత బలంగా ఉందని హెచ్​ఎస్​బీసీలో చీఫ్ ఇండియా ఎకనామిస్ట్ ప్రాంజుల్ భండారి అన్నారు.