లోకల్గా 35 ఫార్మాస్యూటికల్​ ఇన్​గ్రీడియెంట్స్ తయారీ 

లోకల్గా 35 ఫార్మాస్యూటికల్​ ఇన్​గ్రీడియెంట్స్ తయారీ 

న్యూఢిల్లీ: గతంలో దిగుమతి చేసుకుంటున్న 35 ఏపీఐల (యాక్టివ్​ ఫార్మాస్యూటికల్​ ఇన్​గ్రీడియెంట్స్​) తయారీ దేశంలోనే స్టార్టయినట్లు కేంద్ర మంత్రి మన్షుఖ్​ మాండవీయ చెప్పారు. ప్రొడక్షన్​ లింక్డ్​ ఇన్సెంటివ్​ (పీఎల్​ఐ)   స్కీము కిందనే ఈ ప్రాజెక్టులు ఏర్పాటయినట్లు వెల్లడించారు. సుమారు 53 ఏపీఐల కోసం మనం దిగుమతులపైనే 90 శాతం ఆధారపడుతున్నామని, అందులో ఈ 35 ఏపీఐలు ఉన్నాయని పేర్కొన్నారు. 32 మాన్యుఫాక్చరింగ్​ ప్లాంట్లు పై 35 ఏపీఐల తయారీ చేపట్టాయని అన్నారు. దీంతో ఇప్పుడు మనం దిగుమతులపై ఆధారపడాల్సిన అవసరం ఉండదని చెప్పారు.

పీఎల్​ఐ స్కీముకు ఫార్మాస్యూటికల్స్​ రంగం నుంచి మంచి ఆదరణ దొరికిందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని ఏపీఐల తయారీ ఇక్కడే మొదలవనుందని చెప్పారు. కిందటేడాది ఫార్మా రంగం కోసం  రూ. 15 వేల కోట్లతో పీఎల్​ఐ స్కీమును ప్రభుత్వం ప్రకటించింది. సన్​ ఫార్మా, అరబిందో ఫార్మా, డాక్టర్​ రెడ్డీస్​, లుపిన్​, మైలాన్​, సిప్లా, కాడిలా వంటి కంపెనీలు ఇన్సెంటివ్​లకు పీఎల్​ఐ స్కీముకు అర్హత పొందాయి. చాలా ఏపీఐలకు గ్లోబల్​ సప్లయర్​గా చైనానే నిలుస్తోంది. మన దేశంలోని ఎక్కువ కంపెనీలు అక్కడి నుంచే దిగుమతి చేసుకుంటున్నాయి.