10 నెలల గరిష్టానికి తయారీ రంగం

10 నెలల గరిష్టానికి తయారీ రంగం

న్యూఢిల్లీ: మనదేశ తయారీ రంగం  గత నెల ఇది పది నెలల గరిష్టానికి చేరుకుంది. 2024 జూన్  తర్వాత ఇదే అత్యధికమని నెలవారీ సర్వే తెలిపింది. సీజనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మారే హెచ్​ఎస్​బీసీ ఇండియా పర్చేజింగ్​మేనేజర్స్​ఇండెక్స్​ (పీఎంఐ) మార్చిలో 58.1 నుంచి ఏప్రిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 58.2కి పెరిగింది.పీఎంఐ 50 కంటే ఎక్కువ ఉంటే విస్తరణను సూచిస్తుంది. 

అంతర్జాతీయ ఆర్డర్లలో భారీ పెరుగుదల అమ్మకాలను పెద్ద ఎత్తున పెంచింది. 2025–-26 ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో విదేశాల నుంచి కొత్త వ్యాపారం 14 సంవత్సరాలలో అత్యధిక స్థాయికి పెరిగాయని హెచ్​ఎస్​బీసీ చీఫ్ ఇండియా ఎకనామిస్ట్ ప్రాంజుల్  చెప్పారు.