భారీగా గంజాయి పట్టివేత..పక్కా ఇన్ఫర్మేషన్​తో వాహన తనిఖీ

భారీగా గంజాయి పట్టివేత..పక్కా ఇన్ఫర్మేషన్​తో వాహన తనిఖీ

మణుగూరు, వెలుగు : అక్రమంగా తరలిస్తున్న గంజాయిని మణుగూరు పోలీసులు పట్టుకున్నారు. సోమవారం పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో కేసు వివరాలను సీఐ సతీశ్​కుమార్​ వెల్లడించారు. ఏపీలోని డొంకరాయి నుంచి తెలంగాణలోని జహీరాబాద్ కు అశోక్ లేలాండ్ వాహనంలో గంజాయి తరలిస్తున్నారనే పక్కా ఇన్ఫర్మేషన్​తో వాహన తనిఖీలు చేపట్టారు.

హనుమాన్ టెంపుల్ వద్ద అనుమానాస్పదంగా కనిపించిన కారును, అశోక్ లేలాండ్ వ్యాన్ ను తనిఖీ చేశారు. వ్యాన్​లో మామిడికాయల కింద దాచి ఉన్న గంజాయిని గుర్తించారు. రూ.1.19 కోట్ల విలువైన 477 కేజీల గంజాయిని పోలీసులుస్వాధీనం చేసుకున్నారు. కారులో ముగ్గురు వ్యక్తులు ముందు వెళ్తూ వ్యాన్​లో వచ్చేవారిని అలర్ట్​ చేస్తున్నట్లు తెలిసింది. నిందితులు ఏపీలోని మోతుగూడెంకు చెందిన పంగి సునీల్ కుమార్, తెలంగాణలోనియాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన చెరుకుపల్లి శ్రీకాంత్, గుమ్మడిపల్లి అర్జున్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందుకు చెందిన రాయికంటి నాగరాజు, ఎజ్జు సృజన్ గా గుర్తించారు.

రెండు వెహికల్స్​ను సీజ్​చేసి ఐదుగురి నిందితులను రిమాండ్​ తరలించారు. వీరికి డొంకరాయిలో గంజాయి అమ్మిన ముగ్గురు వ్యక్తులు, జహీరాబాద్ లో కొనుగోలు చేస్తున్న మరో ఇద్దరు వ్యక్తులపై కూడా కేసు నమోదు చేశామని, వారు పరారీలో ఉన్నారని సీఐ తెలిపారు. సమావేశంలో ఎస్సై మేడ ప్రసాద్, కానిస్టేబుళ్లు కోటి, రవీందర్, వీర, రామారావు ఉన్నారు.