సీతాఫలంతో పాటు ఆకులు, బెరుడుతోనూ ఎన్ని లాభాలో..

సీతాఫలంతో పాటు ఆకులు, బెరుడుతోనూ ఎన్ని లాభాలో..

నోరూరించే సీతాఫలాల సీజన్ మొదలైంది. ఈ పండులో పుష్కలంగా ఉంటాయి. సీతాఫలంలో ఉండే మెగ్నీషియం గుండెనొప్పి, పక్షవాతం, సైన్ని దరి చేరనివ్వదు. కీళ్లనొప్పులకి చెక్ పెడుతుంది. కడుపు, నోటి అల్సర్లను కూడా తగ్గిస్తుంది. ఇవే కాదు ఇంకా బోలెడు లాభాలున్నాయి సీతాఫలాలు తినడం వల్ల.

• సీతాఫలాల్లో ఇమ్యూనిటీ పెంచే విటమిన్ -సి, యాంటీ ఆక్సిడెంట్లు, ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు ఐరన్, ఫాస్పరస్, మెగ్నీషియం పుష్కలం. ఫైబర్, విటమిన్ - బి6, పొటాషియం కూడా ఎక్కువ. అలాగే సీతాఫలాల్లోని విటమిన్ - ఎ కంటి చూపుకి చాలా మేలు చేస్తుంది. బరువు పెరగాలనుకునే వాళ్లకి సీతాఫలం బెస్ట్ ఆప్షన్. సీతాఫలం చెట్టు పసరుతో మర్దనా చేస్తే తలనొప్పి కూడా తగ్గుతుంది.

ALSO READ:కల్తీని కనిపెట్టే మెషిన్లు 

ఆకులతో మేలు..

సీతాఫలాలతో పాటు చెట్టు ఆకులు, బెరుడు కూడా ఆరోగ్యానికి చాలా మంచివి. ఈ చెట్టు ఆకులతో డికాషన్ చేసుకొని తాగితే డైజెషన్ సమస్యలు తగ్గుతాయి. అలాగే ఈ చెట్టు ఆకుల నుంచి తీసిన కషాయాన్ని ప్రతిరోజూ తాగితే డయేరియా, జలుబు కంట్రోల్ అవుతాయి.

ఈ సీజన్ లో రోజుకో సీతాఫలం తింటే కండరాలు బలపడతాయి. లివర్, బ్రెస్ట్ క్యాన్సర్, మెదడులో ట్యూమర్స్ రాకుండా చేసే గుణం సీతాఫలానికుంది. ఈ పండులోని విటమిన్ -బి6, ఒత్తిడి, డిప్రెషన్ రాకుండా చేయటంతో పాటు మెదడుని చురుగ్గా చేస్తుంది. గర్భిణిలు సీతాఫలం తింటే వాంతులు, వికారం తగ్గుతాయి. సీతాఫలాలు తినటం వల్ల ఎనీమియా నుంచి బయటపడొచ్చు. చర్మ ఆరోగ్యానికి కూడా చాలామంచిది సీతాఫలం. అయితే ఆస్తమా, డయాబెటీస్ ఉన్నవాళ్లు సీతాఫలం తినకూడదు. కిడ్నీ, లివర్ సమస్యలతో బాధపడేవాళ్లు కూడా సీతాఫలానికి దూరంగా ఉండాలి.