ఆధార్​ మిత్రతో ఎన్నో లాభాలు

ఆధార్​ మిత్రతో ఎన్నో లాభాలు

న్యూఢిల్లీ:  ఆధార్ ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్/అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డేట్ స్టేటస్​ని తనిఖీ చేయడం, ఆధార్ పీవీసీ కార్డ్ స్టేటస్​ను ట్రాక్ చేయడం,  ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ సెంటర్ లొకేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, స్లాట్​బుకింగ్​ వంటి సమాచారం గురించి తెలుసుకోవాలంటే ఇది వరకు కాస్త కష్టమయ్యేది. ఇప్పుడు ఇట్లాంటి సమాచారం క్షణాల్లో పొందవచ్చు. ఇందుకోసం  యూనిక్​ ఐడెంటిటీ అథారిటీ ఆఫ్​ ఇండియా (యూఐడీఏఐ) ‘ఆధార్ మిత్ర’ పేరుతో చాట్​ను డెవలప్​ చేసింది. ఇది  ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్​/మెషీన్​ లెర్నింగ్​ ఆధారిత చాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాట్ కాబట్టి యూజర్లు ఏది అడిగినా వెంటనే సమాచారాన్ని ముందుంచుతోంది.  ఆధార్ ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్/అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డేట్ స్టేటస్​ను తనిఖీ చేయడం, ఆధార్ పీవీసీ కార్డ్ స్టేటస్​ని ట్రాక్ చేయడం,  ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ సెంటర్ లొకేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సహా ఎలాంటి ప్రశ్నలను అయినా అడగవచ్చు.

ఏవైనా ఫిర్యాదులు ఉన్నా కూడా ఇది తీసుకుంటుంది.  ఫిర్యాదుల పరిష్కారం ఎక్కడి వరకు వచ్చిందో కూడా దీనిద్వారా తెలుసుకోవచ్చు. 2022 అక్టోబరు నెలలో అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండ్ పబ్లిక్ గ్రీవెన్స్ (డీఏఆర్​పీజీ) డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండ్ పబ్లిక్ గ్రీవెన్స్ (డీఏఆర్​పీజీ) ఇచ్చిన ర్యాంకింగ్స్ రిపోర్టు ప్రకారం.. అన్ని గ్రూప్ ఏ మంత్రిత్వ శాఖలు, విభాగాలు,  అటానమస్ బాడీలలో పబ్లిక్ ఫిర్యాదులను పరిష్కరించడంలో యూఐడీఏఐ మొదటిస్థానంలో నిలిచింది. ర్యాంకింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మొదటిస్థానంలో నిలవడం ఇది వరుసగా మూడో నెల. “ యూఐడీఏఐ.. హెడ్​క్వార్టర్​, ప్రాంతీయ కార్యాలయాలు, సాంకేతిక కేంద్రం, కాంటాక్ట్​ సెంటర్​ పార్ట్​నర్స్​తో కూడిన బలమైన ఫిర్యాదుల పరిష్కారం విధానాన్ని నిర్మించారు.

 అడ్వాన్స్​డ్​ ఓపెన్​ సోర్స్​కస్టమర్​ రిలేషన్​షిప్​ మేనేజ్​మెంట్​ (సీఆర్​ఎం) సొల్యూషన్స్​ను కూడా ఇది వాడుకుంటున్నది.  ఆధార్ హోల్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల సమస్యలను త్వరగా పరిష్కరించడానికి సీఆర్​ఎంను అడ్వాన్స్​డ్​ ఫీచర్లతో తీర్చిదిద్దారు. యూఏడీఐఏ వల్ల ‘ఈజ్​ ఆఫ్​ లివింగ్​’ సులువుగా మారుతోంది” అని కేంద్ర ఎలక్ట్రానిక్స్ & ఐటీ మంత్రిత్వ శాఖ ఒక  ప్రకటనలో తెలిపింది.కొత్త సీఆర్​ఎం సొల్యూషన్ ఫోన్ కాల్,ఈ–మెయిల్, చాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాట్, వెబ్ పోర్టల్, సోషల్ మీడియా, లెటర్,  వాక్- ఇన్ వంటి చానెల్స్​ను సపోర్ట్​ చేస్తుంది. దీని ద్వారా ఫిర్యాదులను ఇవ్వవచ్చు. ట్రాక్ చేయవచ్చు.  కంప్లయింట్లను ఇది సమర్థవంతంగా పరిష్కరించగలుగుతుంది.