మస్క్ కు షాకిచ్చిన ట్విట్టర్ ఉద్యోగులు

మస్క్ కు షాకిచ్చిన ట్విట్టర్ ఉద్యోగులు

రోజుకొక షాక్ ఇస్తున్న ట్విట్టర్ యజమాని ఎలాన్ మస్క్ కు ఆ కంపెనీ ఉద్యోగులు షాక్ ఇచ్చారు. మస్క్ గురువారం ట్విట్టర్ ఉద్యోగులందరికీ మెయిల్స్ పంపిచాడు. దాంట్లో.. ‘ఉద్యోగులంతా ట్విట్టర్ లో కొత్తగా తెచ్చిన్న రూల్స్ కి అనుగుణంగా పనిచేయాలి. ఇష్టంలేనివాళ్లు మూడునెలల జీతాన్ని తీసుకొని కంపెనీ నుంచి వెళ్లిపోవచ్చు. మీకు ట్విట్టర్ లో కొనసాగాలని ఉంటే ఎస్ నొక్కండి’ అనే సింగిల్ ఛాయిస్ ప్రశ్నతో మెయిల్ పంపించాడు. మెయిల్ కింద ‘మీ నిర్ణయాన్ని సాయంత్రం 5 గంటలలోగా చెప్పాల’నే కండీషన్ పెట్టాడు.

దీనిపై ఉద్యోగుల నుంచి తీవ్రంగా వ్యతిరేకత వచ్చింది. చాలామంది మస్క్ ఉద్యోగుల పట్ల ఒక నియంతలా వ్యవహరిస్తున్నాడని అంటున్నారు. మెయిల్స్ చదివిన చాలామంది ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉద్యోగాలకు రాజీనామా చేశారు. అందులో సీనియర్ ఇంజనీర్లు, సీనియర్ ఉద్యోగులు కూడా ఉన్నారని తెలుస్తుంది. అయితే ఎంతమంది ఉద్యోగులు రాజీనామా చేశారని స్పష్టత రాలేదు. ఉద్యోగుల రాజీనామ నిర్ణయంపై స్పందించిన మస్క్ ‘ఈ విషయంపై నేను ఎలాంటి భయం, బాధపడట్లేదు అని చెప్తున్నాడు. దీనిపై #byebyetwitter,#riptwitter,#hardcoreboss అంటూ ఉద్యోగులు వాళ్ల అసహనాన్ని తెలుపుతూ ట్విట్టర్ లో హాష్ ట్యాగ్ ల ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు.