
హైదరాబాద్ : LRS, ధరణి పోర్టల్ ను రద్దు చేయాలంటూ హైదరాబాద్ ధర్నా చౌక్ లో ఆందోళన చేశారు రియల్టర్లు. ఇందులో రియల్టర్లతో పాటు బిల్డర్లు, డాక్యమెంట్ రైటర్లు పాల్గొన్నారు. విపక్ష నేతలు ఆందోళనకు మద్దతు పలికారు. రిజిస్ట్రేషన్లను నిలిపివేయడంతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారన్నారు తెలంగాణ బిల్డర్స్ అసోసియేషన్ ప్రతినిధులు. అక్రమ భూములను సక్రమంగా మార్చుకునేందుకే ధరణి పోర్టల్ తెచ్చినట్టు ఉన్నారని ఆరోపించారు. ఎల్ఆర్ఎస్, ధరణిని రద్దు చేయకుంటే సీఎం క్యాంప్ ఆఫీసు, అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. ధరణి పోర్టల్ కు రిజిస్ట్రేషన్లకు సంబంధం లేదన్నారు మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్. పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చని హైకోర్టు చెప్పిందన్నారు.