వానలకు పలు రైళ్ల రద్దు.. 40 రైళ్ల దారి మళ్లింపు

వానలకు పలు రైళ్ల రద్దు..  40 రైళ్ల దారి మళ్లింపు

సికింద్రాబాద్, వెలుగు: వర్షాల కారణంగా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు వెల్లడించారు. హసన్ పర్తి– కాజీపేట రూట్ లో రైల్వే ట్రాక్ పై భారీగా  వర్షపు నీరు నిలిచి ప్రమాదకరంగా ప్రవహించడంతో రెండువైపులా రాకపోకలను నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు.  5 రైళ్లను పూర్తిగా, నాలుగు రైళ్లను పాక్షికంగా రద్దు చేశామన్నారు. 2 రైళ్లను రీ షెడ్యూల్ చేసి, 40 రైళ్లలను దారి మళ్లించినట్లు అధికారులు వెల్లడించారు. 

సిర్పూర్​కాగజ్​నగర్​– -సికింద్రాబాద్​, సికింద్రాబాద్​– -సిర్పూర్ కాగజ్ నగర్, తిరుపతి–- కరీంనగర్, ​-తిరుపతి రైళ్లను పాక్షికంగా రద్దు చేశామన్నారు. అలాగే తిరుపతి – -కరీంనగర్​ఎక్స్​ప్రెస్​ను కాజీపేట ఈ క్యాబిన్​-కరీంనగర్​ మధ్య రద్దు చేయగా, కరీంనగర్​– తిరుపతి ఎక్స్​ప్రెస్​ను కరీంనగర్–​-వరంగల్​ స్టేషన్ల మధ్య రద్దు చేశామన్నారు.  సిర్పూర్​ కాగజ్ నగర్​ ఎక్స్​ప్రెస్​ను సిర్పూర్ – ఘన్​పూర్​ స్టేషన్ల మధ్య రద్దు చేశామన్నారు. 

ALSO READ:విద్యాసంస్థల్లోకి ఎవ్వరినీ రానివ్వొద్దు: స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్

ఈ రైళ్లలో రిజర్వేషన్లు చేసుకున్న ప్యాసింజర్లు వారి జర్నీని ప్లాన్ చేసుకోవడానికి అన్ని ప్రధాన రైల్వే స్టేషన్లతో పాటు దారి మళ్లించిన మార్గాల్లో హెల్ప్ లైన్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. సికింద్రాబాద్, హైదరాబాద్, విజయవాడ, నిజామాబాద్, వరంగల్, కాజీపేట, ఖమ్మం, మంచిర్యాల, సిర్పూర్ కాగజ్ నగర్, రామగుండం, ఒంగోలు, సామర్లకోట, రాజమండ్రి స్టేషన్లలో హెల్ప్ లైన్ సెంటర్లు ఉన్నాయన్నారు. సికింద్రాబాద్(040-27801111 /27786666), కాజీపేట (0870 2576430), విజయవాడ  (0866-2576924), గూడూర్ (7815909300).