Good Food : సూపర్ ఫ్రూట్ జామ పండు రోజూ తింటే ఎన్ని ఆరోగ్యాలో తెలుసా..!

Good Food : సూపర్ ఫ్రూట్ జామ పండు రోజూ తింటే ఎన్ని ఆరోగ్యాలో తెలుసా..!

హెల్దీగా ఉండాలంటే.. టైంకి తినాలి. ఆ తినే తిండి కూడా ఆరోగ్యానికి మేలు చేసేదై ఉండాలి. అలాంటి హెల్దీ ఫుడ్స్ ఫ్రూట్స్ ఎప్పుడూ ముందు వరుసలోనే ఉంటాయి. అందుకే ఏ సీజన్ ప్రూట్స్ ని ఆ సీజన్లో తప్పకుండా తినాలి. ఇది జామ పండ్ల సీజన్. మరి వీటిలో దాగున్న పోషకాలేంటంటే..

జామ పండ్లలోని ఫైబర్ డైజెషన్ ట్రాక్ హెల్త్  ని కాపాడుతుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని పెంచే కాంపౌండ్స్ ఉంటాయి ఈ సూపర్ ఫ్రూట్. దంతాల ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది జామ. చర్మంతో పాటు జుట్టు, కళ్ళకి చాలా మేలు చేస్తుంది. హైపర్ టెన్షన్, కొలెస్ట్రాల్ ని అదుపు చేసి గుండె జబ్బుల్ని దూరం పెడుతుంది. ఇవే కాదు ఇంకా బోలెడు లాభాలున్నాయి జామతో.

 • జామలోని పొటాషియం గుండె జబ్బుల్ని దరి చేరనివ్వదు. వీటిని రెగ్యులర్ గా తింటే బ్లడ్ ప్రెజర్ అదుపులో ఉంటుంది. అలాగే విటమిన్ -సి ఎక్కువగా ఉండే     జామపండు తినడం వల్ల హైపర్ టెన్షన్, ఇన్ఫెక్షన్ల నుంచి బయటపడొచ్చు. 
• జామలోని లైకోపీన్, క్వెర్సెటిన్, పాలీఫెనాల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ గా పనిచేస్తాయి. ఫ్రీ ర్యాడికల్స్ ని బ్యాలెన్స్ చేసి క్యాన్సర్ సెల్స్ ని అదుపు చేస్తాయి. బ్రెస్ట్     క్యాన్సర్ ని దరిచేరనివ్వవు. 
• ఈ ఫ్రూట్ రోజంతా శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచుతుంది. అలాగే బాడీలోని ఎలక్ట్రోలైట్స్ ని బ్యాలెన్స్ చేస్తుంది. వీటిల్లోని మెగ్నీషియం కండరాలు, నరాల్నిరిలాక్స్       చేసి, స్ట్రెస్ని దూరం చేస్తుంది.
• బ్లడ్ లోని చెడు కొలెస్ట్రాల్ ని అదుపుచేస్తుంది జామ. అంతేకాదు మంచి కొలెస్ట్రాల్ ని పెంచి, కార్డియోవాస్క్యులర్ సిస్టమ్ పనితీరుని
  మెరుగుపరుస్తుంది.
• జామ చర్మాన్ని మెరిపిస్తుంది కూడా. ఈ ఫ్రూట్ లోని విటమిన్ ఎ, బి చర్మాన్ని ఫ్రెష్ గా ఉంచుతాయి. ముడతల్ని తగ్గిస్తాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ స్కిన్   డ్యామేజ్ ని తగ్గిస్తాయి.
 • నెలసరి నొప్పుల నుంచి కూడా రిలీఫ్ ఇస్తుంది జామ. జామ ఆకుల జ్యూస్ కూడా పొత్తి కడుపు నొప్పిని తగ్గిస్తాయి.
• జామపండులో కేలరీలు చాలా తక్కువ. పైగా రోజులో శరీరానికి కావాల్సిన పన్నెండు శాతం ఫైబర్ ఉంటుంది వీటిల్లో, దానివల్ల అధిక బరువు కంట్రోల్ అవుతుంది.
• వంద గ్రాముల జామలో ఇరవై రెండు గ్రాములు మెగ్నీషియం, 40 గ్రాముల పాస్ఫరస్ ఉంటుంది. అలాగే విటమిన్- బి3, బి6 పుష్కలం. వీటిల్లోని నియాసిన్, పెరిడాక్సిన్ మెదడులో రక్త ప్రసరణ సజావుగా జరిగేలా చూస్తాయి. 
• జామలో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. దానివల్ల రక్తంలోని షుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉంటాయి. 
• ఆడవాళ్లు ప్రెగ్నెన్సీలో ఫోలిక్ యాసిడ్, విటమిన్ -బి9 ఎక్కువగా ఉండే జామ తింటే పిల్లలు ఆరోగ్యంగా పుడతారు.