
దంతెవాడ జిల్లా కిరండోల్ పరిధిలో ఘటన
భద్రాచలం, వెలుగు:ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లా కిరండోల్ పోలీస్ స్టేష న్ పరిధిలో ఆదివారం జరిగిన ఎన్ కౌంట ర్లో మావోయిస్టు కమాండర్ గుడ్డీ హతమయ్యాడు. బీజేపీ ఎమ్మెల్యే భీమా మండావి హత్య కేసులో ప్రధాన నిందితుడు, సూత్రధారి గుడ్డీ కోసం ఛత్తీస్ గఢ్ పోలీసులు కొన్ని రోజులుగా గాలిస్తున్నారు. కిరండోల్ పోలీస్ స్టేష న్ పరిధిలోని మలంగర్ అడవుల్లో మావోయిస్టులు సమావేశమైనట్లుగా సమాచారం అందుకున్న డీఆర్‍జీ బలగాలు ఆ ప్రాంతానికి వెళ్లాయి. సుమారు 40 మంది మావోయిస్టులు సమావేశమైనట్లుగా గుర్తించా రు. ఈ క్రమంలో ఇరువర్గాల నడుమ ఎదురు కాల్పులు జరిగాయి. సంఘటనా స్థలంలో గుడ్డీ మృతదేహంతో పాటు 9ఎంఎం పిస్టల్ లభించింది. మిగిలి న నక్సల్స్ పారిపోయారు.