హైదరాబాద్, వెలుగు: ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మరో 6 నెలల పాటు కాల్పుల విరమణ ప్రకటిస్తున్నట్టుగా మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రకటించింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరిట సోమవారం ఓ లేఖను రిలీజ్ చేశారు. గత ఏప్రిల్, మే, జూన్ నెలల్లో తెలంగాణలో అన్ని పార్టీలు, ప్రజాసంఘాలు, సామాజిక వర్గాలు శాంతియుత వాతావరణం కొనసాగాలని పెద్దఎత్తున ఉద్యమాలు చేసినట్టుగా తెలిపారు. ప్రజల అభీష్టానానికి అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం కూడా స్పందించిందని చెప్పారు.
