మావోయిస్టులకు తిండి కష్టాలు

మావోయిస్టులకు తిండి కష్టాలు

బస్తర్ : లాక్ డౌన్ కారణంగా మావోయిస్టులు తిండికి కష్టాలు పడుతున్నారు. రెగ్యులర్ గా వారికి రేషన్ అందించే చెయిన్ సిస్టమ్ స్ట్రక్ అయ్యింది. దీంతో బియ్యం, పప్పు, ఉప్పు కోసం బస్తర్ డివిజన్ లోని గ్రామస్తులను రేషన్ ను బలవంతంగా తీసుకెళ్తున్నారని పోలీసులు చెబుతున్నారు. ఛత్తీస్ గఢ్ లోని బస్తర్ మావోయిస్టులకు సురక్షితమైన అడ్డా. దంతెవాడ, బీజాపూర్, బస్తర్, నారాయణపూర్, కొండగావ్, సుక్మా, కంకేర్ ఈ ఏడు జిల్లాల పరిధిలో పెద్ద ఎత్తున మావోయిస్టులు ఉంటారు. వీరికి రేషన్ సప్లయ్ కోసం కొంతమంది కొరియర్స్ ద్వారా ఓ సిస్టమ్ ఉంటుంది. లాక్ డౌన్ కారణంగా గ్రామాల్లో షాప్ లన్నీ మూసేస్తున్నారు. సమీపంలోని పట్టణాల్లోకి వెళ్తితే పోలీసులకు పట్టుబడుతామని కొరియర్స్ వెళ్లటం లేదు. దీంతో మావోయిస్టులు గ్రామస్తులను, ట్రైబల్స్ ను బెదిరించి వారి తిండి గుంజుకుంటున్నారని బస్తర్ డివిజన్ ఇన్స్ పెక్టర్ సుందర్ రాజ్ తెలిపారు. ప్రజలపై పట్ల మావోయిస్టులకు ఎలాంటి కన్ సర్న్ ఉందో తెలుసుకోవటానికి సంఘటనలే ఉదాహరణలన్నారు. రిమోట్ విలేజేస్ లో గ్రామస్తులను బెదిరించి రేషన్ లాక్కుంటున్నారన్న సమాచారం ఉంది. అలా జరగకుండా సెక్యూరిటీ ఏర్పాటు చేస్తున్నామని దంతెవాడ ఎస్పీ అభిషేక్ పల్లవ తెలిపారు. సాధారణంగా మార్చి నుంచి మే వరకు కావాల్సిన రేషన్ ను మావోయిస్టులు ముందే తెచ్చుకుంటారని కానీ ఈ సారి వారికి రేషన్ కొరత ఉందని పోలీసులు చెప్పారు. ఇది మావోయిస్టుల వార్ ఫేర్ స్ట్రాటేజీ పై ఎఫెక్ట్ చూపుతుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.