
గడ్చిరోలి : మహారాష్ట్ర లో మావోయిస్టులు విధ్వంసానికి పాల్పడ్డారు. గడ్చిరోలి జిల్లాలోని ధనోరా లో మూడు ట్రక్కులను కాల్చేశారు. వీటిని ఇక్కడ రోడ్డు నిర్మాణ పనుల కోసం వినియోగిస్తున్నారు. కరోనా సంక్షోభంలో మావోయిస్టులు ఎలాంటి దాడులకు పాల్పడరన్న ఉద్దేశంతో ఇక్కడ రోడ్డు పనులను కొనసాగిస్తున్నారు. కానీ పనులను అడ్డుకొని మావోయిస్టులు సంఘటనకు పాల్పడ్డారు. సమాచారం తెలిసిన వెంటనే సంఘటన జరిగిన ప్రాంతానికి పోలీసులు చేరుకున్నారు. చుట్టుపక్కల ఏరియాలో మావోయిస్టులకు కోసం గాలింపు చర్యలు మొదలుపెట్టారు.