రాజన్న సిరిసిల్లలో మావోయిస్టుల లేఖ కలకలం

రాజన్న సిరిసిల్లలో మావోయిస్టుల లేఖ కలకలం

రాజన్న సిరిసిల్ల జిల్లాలో మావోయిస్టుల లేఖ కలకలం రేపుతోంది. తంగళ్ళపల్లి మండలం అంకిరెడ్డి పల్లి గ్రామ పంచాయతీ గోడకు పది రోజుల క్రితం మావోయిస్టు జగన్ పేరిట లేఖ వెలసింది. గ్రామంలోని పలువురికి తీవ్ర హెచ్చరికలు చేస్తూ..ఈ లేఖలో పలు అంశాలు ప్రచురించారు. ఈ లేఖ చూసిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే ఇది ఎవరో వ్యక్తిగత కక్ష్యలతో మావోయిస్టుల పేరుతో అతికించినట్లుగా గ్రామస్తులు భావిస్తున్నారు. ఈ లేఖ రాసింది ఎవరన్న కోణంలో  పోలీసులు దర్యప్తు చేస్తున్నారు.