బీజేపీ నేతలు ఎన్నికల ప్రచారం చేయొద్దు: హెచ్చరించిన మావోయిస్టులు

బీజేపీ నేతలు ఎన్నికల ప్రచారం చేయొద్దు: హెచ్చరించిన మావోయిస్టులు

ఛత్తీస్ గఢ్ దంతెవాడలో చిందనార్, తుమ్రిగుండ రహదారిని దిగ్బంధించారు మావోయిస్టులు. లోక్ సభ ఎన్నికల ప్రచారానికి బిజేపి నేతలు, కార్యకర్తలు దూరంగా ఉండాలని హెచ్చరించారు. వాహనాలు వెళ్లకుండా రోడ్లపై రాళ్లు అడ్డుపెట్టారు.

 తమ హెచ్చరికలను కాదని క్యాంపెయిన్ లలో పాల్గొంటే కిరాతకంగా హత్య చేస్తామని బ్యానర్లు పెట్టారు. ఆదివాసీల హత్యలకు బిజేపి ప్రభుత్వమే బాధ్యత వహించాలని పోస్టర్లలో తెలిపారు. తర్వాత బర్సూర్ పోలీస్ స్టేషన్ సిబ్బంది, చిద్నార్ CRPF భద్రతా బలగాల బృందం రోడ్డును పునరుద్దరించారు.

మరోవైపు ఛత్తీస్ గఢ్ లో స్థానిక పోలీసులుతోపాటు భద్రతా బలగాలు మావోయిస్టులను ఏరివేస్తున్నారు. ఏప్రిల్ 16న కంకేర్ అటవి ప్రాంతంలో జరిగిన భారీ ఎన్ కౌంటర్ లో 29మంది మావోయిస్టులు మృతి చెందిన సంగతి తెలిసిందే.